శెట్టి, వర్మ, గావుండ, రాయ, నాయుడు, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు.
బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన మరియు చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు. 56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు. 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ అపారమైన “వ్యాపారాలు” చేసేవారు. గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా “బలిజ మహానాడు”లు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు.
వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన “బలిజలు” అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని కూడా పిలువబడినారు, చంద్రవంశ బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు, యదువంశ బలరాముని పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు. సూర్య, చంద్ర, యదు, నాగ వంశాలవారు తరువాత “బలిజవారు” గ పిలువబడినారు. చాళుక్య, చోళ, పల్లవ, హైహయ, హొయసల, కాకతీయ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు. ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉన్నది.
వీరినే తమిళనాడులో “కవరై” అని, కర్ణాటకలో “బనజిగర్” అని కూడా అంటారు…ఉత్తరాదిన “బనియా”, “వనియా” అనీ అంటారు. ఈ పేర్లన్నీ “వణిజ” అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి..
వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంధాలలోను, జైన, బౌద్ధ వాఙ్మయాలలోనూ వర్ణించబడినారు. వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలవబడతారు. కన్నడ ప్రాంతం వారు “కన్నడ బలిజ” అని, తమిళ ప్రాంతం వారు “ఆరవ బలిజ” అని, తెలుగు ప్రాంతం వారు “తెలుగు బలిజ” లేదా “తెలగబలిజ” అని పిలవబడ్డారు. ఈ బలిజవారిలో అనేక ఉప కులాలు వర్గాలు ఉన్నాయి. వాటిలోకొన్ని: రాచబలిజ, క్షత్రియబలిజ, తుర్వ బలిజ, తుళువ కవరై, రాహుతబలిజ, ఒప్పనకారబలిజ, ముసుగుబలిజ, రత్నాలబలిజలు, తెలగబలిజ, పట్టణశెట్టి, పట్టణస్వామి, వలయాలసెట్టి, గాజులబలిజ, గంధంబలిజ, పువ్వులబలిజ, బలిజిగ, బందరుకవరై, కవరై వడుగన్, లింగమండికవరై, కవరై చెట్టి, రాయదుర్గంబలిజ, కాంచిపురంబలిజ, వక్కలబలిజ, ఉప్పుకవరై, నాయుడు, అరవబలిజ, ఆకుబలిజ, బలిజశెట్టి, బుట్టిబలిజ, పెరికబలిజ, బలిజనాయుడు, దూదిబలిజ, ఏనూటిబలిజ, గవరబలిజ, గండవరంబలిజ, కుల్లూరుబలిజ, గోపతిబలిజ, గోనుగుంటబలిజ, గుగ్గిళ్ళబలిజ, మిరియాలబలిజ, గురుబలిజ, గోరిబలిజ, గౌరబలిజ, కొండేటిబలిజ, లింగబలిజ, మహతడిబలిజ, నీలిబలిజ, పెదకంటిబలిజ, పాటిబలిజ, పలాసకవరై, పగడాలబలిజ, రాజమహేంద్రవరంబలిజ, శెట్టిబలిజ, తోటబలిజ, తొగరుబలిజ, ఆదిబనజిగ, జైనబణజిగ, సజ్జనబలిజ, లింగాయత బలిజ, దాసబలిజ, విజయనగరంబలిజ, పెనుకొండబలిజ, చంద్రగిరిబలిజ, గంజాముబలిజ, ఓరుగంటిబలిజ, దేశాయిశెట్టి, మహానాటిబలిజలు, ముత్యాలబలిజలు, రాళ్ళ బలిజలు, కండీబలిజలు, కొయిలడిబలిజలు, మహాజనబలిజ, చిత్రాలబలిజ, పత్తిబలిజ, జనపబలిజ, ఓడబలిజ, వలసబలిజ, పూందమల్లిబలిజ ఇలా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు మహారాష్ట్ర, తమిళనాడు , కర్ణాటక, ఒడిషా , కేరళ ,
పాండిచ్చేరి , ఆంద్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో గణనీయంగా ఉన్నాయి.
చాళుక్య, చోళ, పల్లవ, కాకతీయుల కాలాలలోనే వీరిని బలిజలుగా పేర్కొన్నారు. విజయనగర కాలంనాటికి అపారమైన సంపదలతో ఎంతో గొప్ప వైభవ జీవితాలను చవిచూసిన వీరు, విజయనగర పతనం తరువాత జరిగిన అనేక రాజకీయ సామాజిక మార్పులతో అపార సంపదలు హరించుకుపోగా, వీరిలో కొందరు తెలుగు ప్రాంతములో ముఖ్యంగా “గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గంజాం” జిల్లాలలో – తెలగాబలిజలుగా , తెలగాలుగా కూడా పిలుచుకొనుచూ సైనిక, వ్యాపార జీవనం సాగిస్తూ రానురానూ 1890 నాటికి సైనిక, వ్యాపార అవకాశాలు తగ్గటంతో గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములుగా, తరువాత వ్యవసాయదారులుగా స్థిరపడుతున్న క్రమంలో వీరిలో కొందరు గ్రామాలలో పెద్దలుగా ఉంటూ పెద్దకాపు (మునసబు)లుగా పిలువబడుతూ వ్యవసాయం చేస్తూ కాపు అని పేరుతొ కూడా పిలువబడినారు. వీరు తప్ప మిగతా దక్షిణభారతదేశములో అంతటా విస్తరించి ఉన్న వీరి కుల వర్గం వారందరూ బలిజ వారు అని మాత్రమే పిలవబడుచూ చరిత్ర కలిగి ఉన్నారు…
కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, బలిజ అని, ఒంటరి అని, తూర్పుకాపులు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణలో మున్నూరుకాపులు అని, బలిజ అని వ్యవహరిస్తారు.
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ లలో వీరిని లింగ బలిజ కులస్తులు అని కూడా అంటారు.
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో వీరు 1921 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్ ప్రకారం ఈ బలిజ,
తెలగ , ఒంటరి , కాపు కులస్తులు 18,38,570 మంది ఉన్నారు. అనగా 14 శాతం నుండి 15శాతం వరకు కలరు.
బలిజల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలని వీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు, మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన
రిజర్వేషన్ సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా బీ.సీ. ల లాగానే
స్కాలర్షిప్పులు మంజూరు చేసింది.
ఇప్పుడిప్పుడు తూర్పుకాపులు మున్నూరు కాపులు తో వియ్యమందుతున్నారు. తూర్పు కాపులు అనేవారు ఒకప్పుడు గాజుల బలిజ కులస్తులు అని వారి చరిత్ర తెలియజెబుతుంది.. అలానే మున్నూరు కాపులు అనేవారు సీమాంధ్ర నుండి తెలంగాణకు వలస వెళ్లిన 300 బలిజ కుటుంబాల వారి సంతతి అని వారి చరిత్ర తెలియజెబుతుంది.
నిజానికి కాపులు అనేవారిలో 1871నుండి 1931 వరకూ ఉన్న బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ మాన్యువల్స్, గాజీటీర్స్ ప్రకారం ప్రస్తుతం రెడ్లు అని పేరు మార్చుకున్నవారు కూడా కలిసే ఉన్నారు. నేటికీ వీరందరిని కాపులు అనే పిలుస్తారు. అయితే తీరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలోని అత్యధిక కాపులు బలిజ సామాజిక వర్గంనుండి వ్యవసాయదారులుగా మారి కాపు అని పిలుచుకుంటున్నట్టు గతంలో 1950 లలో వచ్చిన కంటే నారాయణ దేశాయి గారి బలిజకుల చరిత్ర గ్రంధంలో, 1920 లలో వచ్చిన తెలగ సంఘాభివర్ధిని వంటి గ్రంధాలలో పేర్కొన్నారు. వీరికి రెడ్లుగా మారిన పాకనాటికాపు, మొరసుకాపు, పంటకాపు, దేసూరి కాపు, పొంగలనాటికాపు, ఓరుగంటికాపు, కోనకాపు, మోటాటికాపు, వెలనాటికాపు, నేరడికాపు, అయోధ్యకాపు, భూమంచికాపు, కుంచేటి కాపు, మున్నూటికాపు, గోదేటికాపు, గండికోట కాపు వంటి పంట 14 నాడుల కాపు కులస్తులకు ఏవిధమైన సంబంధం లేదు. తీరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, తెలంగాణాలో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉన్న పంట 14 నాడుల కాపు కులస్తులు ప్రస్తుతం రెడ్లు అని మార్చుకున్నారు. ఈ కాపులకు, ఈ ప్రాంతాలలో తరతరాల నివసిస్తున్న బలిజ కులస్తులకు వైవాహిక సంబంధాలు లేవు…..